సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం చిత్రం సెకండ్ టీజర్ వచ్చేసింది. పోలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఏపీలో జరిగిన పరిణాలమాలను ఇందులో తెరకెక్కిస్తున్నారు.
RGV Vyooham: తెలుగు చిత్రపరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేస్థాయిలో ఆయన్ని విమర్షించేవారు ఉన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన వ్యూహం(Vyooham) చిత్రానికి సంబంధించిన 2వ టీజర్ వచ్చేసింది. ఇదివరకే ఆయన పొలిటికల్ సెటైర్ చిత్రాలను తెరకెక్కించారు. వాటిలాగే ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన టీజర్లు చూస్తే అర్థం అవుతుంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఎలా ఉందంటే..
నిజం షూ లేస్ కట్టుకునేలోపే ”అబద్ధం ప్రపంచమంతా ఓ రౌండేసి వస్తుంది” అనే డైలాగ్‌తో ప్రధాన పాత్ర చుట్టూ ఎన్ని రాజకీయ కుట్రలు జరిగాయనేది చూపించారు. అలాగే చిత్రంలో రాజకీయ నేతలు వేసే వ్యూహాలను, ప్రతి వ్యూహాలను రచిస్తున్న నాయకులున్నారు. ఇక జగన్ జైల్ సీన్లను, అక్కడ జరిగే ఎమోషనల్ సన్నివేశాలను సినిమాలో హైలెట్ చేసి చూపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ”అలాగే ఎప్పుడోకప్పుడు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా” అనే డైలాగ్ ఉంటుంది. దానికి సీబీఎన్ గెటప్‌లో ఉన్న పాత్రదారుడు ”వాడికంత సీన్ లేదు.. తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు” అని అంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం గుర్తుకు వస్తుంది. మరి పూర్తి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే విడుదల అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే.