»Hero Surya Has Given Clarity On The News Of Shifting To Mumbai
Surya: సూర్య ముంబాయికి మకాం మార్చాడా.. ఆయన ఏమన్నాడంటే
ముంబైకి మకాం మార్చినట్లు వస్తున్న వార్తలపై హీరో సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య అందరి సమక్షంలో నిజం చెప్పారు. అక్కడ తనకు ఇళ్లు ఉన్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉండేది సూర్య కాదట.
Surya: తమిళ హీరో అయినా తెలుగులో స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య(Surya). ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఆయనకు సంబంధించినవి ఏ విషయం అయినా అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే తనపై మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పెద్దగా గాసిప్స్ ఉండదు. కానీ ఈ మధ్య ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించి.. తన కుటుంబంతో కలిసి సూర్య ముంబాయి(Mumbai)కి మకాం మార్చాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై హీరో స్పందించారు.
ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య దీనికి సమాధానం చెబుతూ ఆ వార్తలను కొట్టిపడేశారు. అయితే తనకు ముంబాయిలో ఇళ్లు ఉందని, అది కేవలం తన కుమార్తె, కొడుకు చదువు కోసమే అని స్పష్టం చేశారు. వారు ముంబైలో ఉన్నారని, తాను మాత్రం తమిళనాడు(Thamilanadu)లోనే ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తాను మంచి కొడుకుగా, మంచి నాన్నగా, మంచి భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. జీవితంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్న తపనతో నటుడు మాధవన్‌తో కలిసి కొన్ని రోజులుగా గోల్ఫ్ ఆడుతున్నట్టు సూర్య వివరించారు. ఇక సినిమా విషయాలకు వస్తే.. ప్రస్తుతం ఆయన ఓ భారీ బడ్జెట్ చిత్రం కంగువ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ వరల్డ్ చిత్రంగా దాదాపు 10 భాషాల్లో విడుదల అవుతున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో సూర్య విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానుంది.