భారత్(India)లో నేడు స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలు జరుగుతున్నాయి. అయితే పాకిస్థాన్(Pakistan) ఒక రోజు ముందుగా నిన్న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. ఈ తరుణంలో పాక్‌కు ఘోర అవమానం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ పాక్ మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తమకు ఎదురైన తలవంపులను తట్టుకోలేక పాకిస్థానీయులు తీవ్ర ఆవేదన చెందారు. తమ బతకులు ఇలా అయ్యాయంటూ ఓ మహిళ భావోద్వేగానికి లోనై సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది.
పాక్ మహిళ పోస్ట్ చేసిన వీడియో:
A Pakistani lady narrates, How Pakistan flag didn't show up on Burj Khalifa on their Independence daypic.twitter.com/WNbEOetANL
సాధారణంగా దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిపై స్వాతంత్య్ర దినోత్సవం వేళ పాక్ జెండా కనిపిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫా ప్రదర్శిస్తూ రావడం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఈసారి తమ జెండాను చూసేందుకు వచ్చిన పాక్ ప్రజలకు నిరాశ ఎదురైంది. బుర్జ్ ఖలీఫా భవంతిపై తమ జెండా కనిపించకపోవడంతో పాక్ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు.
అయితే భారత జెండా మాత్రం యథాతథంగా బుర్జ్ ఖలీఫా భవంతిపై ప్రదర్శితమైంది. అయితే పాక్ జెండా కనిపించకపోవడంపై పాకిస్థానీయులు దుబాయ్ అధికారులపై మండిపడ్డారు. ఈ సమయంలో ఓ మహిళ తమ బతుకులు ఇలా అయిపోయాయని భావోద్వేగానికి లోనై వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.