శంకర్ సినిమా అంటేనే.. డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాలి. శంకర్‌తో సినిమా తీసే వారు తరచుగా చెప్పే మాట. ప్రస్తుతం దిల్ రాజుతో భారీగా ఖర్చు చేయిస్తున్నాడు శంకర్. ఎంతలా అంటే.. ఒక్క పాటకే 20 కోట్లు అనే టాక్ నడుస్తోంది.
Game Changer: పాటలకు కోట్లకు కోట్లు ఖర్చు చేయడంలో స్టార్ డైరెక్టర్ శంకర్ తర్వాతే ఎవ్వరైనా. మామూలుగా అయితే సినిమా మేకింగ్‌కు వందల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుంటారు. కానీ శంకర్ మాత్రం కేవలం పాటల కోసమే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు పెట్టాల్సిన బడ్జెట్ పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా పాటలకు.. దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారనే న్యూస్ గతంలో తెగ వైరల్ అయింది. ఈ లెక్కన గేమ్ చేంజర్ సాంగ్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక.. అప్పుడెప్పుడో టైటిల్ అనౌన్స్ చేసిన శంకర్.. దసరా సందర్భంగా దీపావళికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామని ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లీక్ అయిన జరగండి సాంగ్‌నే ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్లో వందల మందితో భారీ సెట్టింగులు కనిపించాయి. దీంతో ఈ పాటకు బడ్జెట్ ఎంత పెట్టారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సాంగ్‌కి ఏకంగా 20 కోట్లు ఖర్చు చేశారనే టాక్ నడుస్తోంది సోషల్ మీడియాలో. కొందరు మాత్రం 12 కోట్లు, 15 కోట్లు అని అంటున్నారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో కనిపించిన అన్ని ఇండ్లను సెట్టింగ్స్ వేయించి షూట్ చేసాడట. వారం రోజుల పాటు శంషాబాద్‌లో వేసిన సెట్లో ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్స్‌తో ఈ జరగండి సాంగ్ తెరకెక్కించారట. అందుకే.. అంత భారీ బడ్జెట్ అయ్యిందని అంటున్నారు. ఈ పాటకు ఎంత ఖర్చు చేశరనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. శంకర్ రేంజ్‌కు మినిమమ్ పది కోట్లకు పైగా ఖర్చు చేసి ఉంటారని చెప్పొచ్చు. మరి తమన్ ట్యూన్, శంకర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి.