హ్యాట్రిక్ హిట్ కొట్టి మరో సెంచరీ కొట్టేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం థియేటర్లో ఉన్న సినిమాల్లో భగవంత్ కేసరిదే హవా నడుస్తోంది. ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లను రాబట్టిన కేసరి.. నెక్స్ట్ వీక్ కూడా గట్టిగానే వసూలు చేసే ఛాన్స్ ఉంది.
Bhagwant Kesari: లియో కలెక్షన్స్ భారీగా ఉన్నాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు.. కానీ అవి ఫేక్ అంటున్నారు. అయితే టైగర్ నాగేశ్వర రావు లెక్కలు మాత్రం బయటికి పెద్దగా రావడం లేదు. ఇప్పటి వరకు 50 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు. అందుకే.. ఈసారి దసరా విన్నర్‌గా బాలయ్య నిలిచాడనే చెప్పాలి. అక్టోబర్ 19న రిలీజ్ అయి.. క్రమ క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్లిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. దసరా పండుగ సెలవులు బాలయ్యకు బాగా కలిసొచ్చాయి. ఓవైపు దళపతి విజయ్ ‘లియో’.. మరోవైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు నుంచి గట్టి పోటీ ఎదుర్కున్నప్పటికీ బాలయ్య సినిమా ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరువలో ఉంది. మొదటి వారంలో 112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో బాలయ్య ఊపు ఏమాత్రం తగ్గే ఛాన్సే లేదు. ఈ వీకెండ్ కూడా ‘భగవంత్ కేసరి’దే డామినేషన్ కానుంది. ఈ వారమే కాదు.. ఇంకో వారం పాటు కేసరిదే హవా కానుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి.. బయ్యర్లకు లాభాలు అందించడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేసింది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.