Manoj Bajpayee:ఫస్ట్ టైమ్ ప్లైట్ జర్నీ (flight jpurney) చేసేవారి ఫీలింగ్ వేరు.. చాలా మంది భయపడతారు. ఇక ఏం సర్వ్ చేస్తారో అసలే తెలియదు. దేశంలో తిరిగితే పాస్ పోర్ట్ (passport) కూడా అవసరం లేదు. విదేశాలకు అయితే పాస్ పోర్ట్ కంపల్సరీ.. అలాగే ఫారిన్ వెళ్లే ప్లైట్లలో లిక్కర్ సర్వ్ చేస్తారు. అన్నీ విమానాల్లో కాదు.. కొన్నింటిలో మాత్రమే స్పెషాలిటీస్ ఉంటాయి. ధర కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే వయా తిప్పుతూ తీసుకెళతారు.
విదేశాలకు వెళ్లే సమయంలో లిక్కర్ (liquor) ఫ్రీగా సర్వ్ చేస్తారనే విషయం నటుడు మనోజ్ బాజ్ పేయికి (Manoj Bajpayee) తెలియదట. ఫారిన్ వెళ్లేప్పుడు మందు తీసుకోలేదట. తర్వాత తెలిసి.. వచ్చేప్పుడు మాత్రం తెగ పెగ్స్ (pegs) కొట్టేశాడట. తాగి పడిపోయానని వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవానులను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాప్ స్టిక్స్తో (sticks) ఫుడ్ (food) తినడం సరిగా రాదని చెప్పాడు.ఆ తర్వాతే అన్నీ విషయాలు తెలిశాయని.. మెల్లిగా నేర్చుకున్నానని వివరించారు. అటు పోట్లతో సినీ ఇండస్ట్రీలో అడుగిడానని వివరించారు.
మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెబ్ సిరీస్లో (web series) కూడా నటిస్తున్నారు. ఫ్యామిలీ మెన్ (familyman) సిరీస్లో ఎన్ఐఏ అధికారి (nia officer) రోల్ పోషించి.. ప్రశంసలు పొందారు.