Revanth reddy:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ సరయిన క్రమంలో జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. చిన్న ఉద్యోగులను విచారించి చేతులు దులుపుకోవాలని విచారణ సంస్థ సిట్ (sit) అనుకుంటుందని చెప్పారు. ఈ అంశంపై తాము గవర్నర్ (governer) తమిళి సై సౌందరాజన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. కమిషన్‌ను రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై (cm kcr) విచారణకు అనుమతి కోరితే గవర్నర్ స్పందించడం లేదని గుర్తుచేశారు.పేపర్ లీకేజీకి (paper leak) సంబంధించి ఈడీకి తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. దాంతో ఈడీ రంగంలోకి దిగిందని వివరించారు. విద్యార్థుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు.
నల్గొండ మాహాత్మా గాంధీ వర్సిటీలో ఈ నెల 21వ తేదీన నిరుద్యోగ నిరసన చేపడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. మే 4 లేదా 5న సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొంటారని పేర్కొన్నారు. మే 9వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని వివరించారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పేపర్ లీకేజీలో మనీ ల్యాండరింగ్ జరిగిందనే కోణంలో నిన్న ఈడీ (ed) అధికారులు జైలులో ఉన్న ప్రవీణ్ (praveen), రాజశేఖర్ రెడ్డిని (rajasekhar reddy) విచారించారు. పేపర్ లీకేజీ కేసులో కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ (satya narayana), సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీని (sankara laxmi) ఇదివరకే ఈడీ అధికారులు విచారించారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్ లక్ష్మీ వాంగుల్మాన్ని ఈడీ అధికారులు (ed officials) రికార్డ్ చేశారు. శంకర్ లక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జీగా ఉండగా.. ప్రవీణ్ (praveen), రాజశేఖర్‌కు (rajashekar) పేపర్లు ఎలా వచ్చాయనే వివరాలను ఈడీ అధికారులు (ed officials) ఆరా తీశారు.
ఇటు పేపర్ లీకేజీలో రూ.40 లక్షలు చేతులు మారాయని సిట్ (sit) గుర్తించింది. నిందితుల నుంచి సిట్ రూ.7 లక్షలను సేకరించింది. పేపర్ లీకేజీకి సంబంధించి సిట్ హైకోర్టుకు (high court) స్టేటస్ రిపోర్టును ఇదివరకే సమర్పించిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ ప్రధాన నిందితులు అని పేర్కొంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ఇదివరకే తెలిపారు.