Health director srinivas made sensational comments
HD Srinivas:తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు (srinivasa rao) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కరోనా (corona) సమయంలో ప్రెస్మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చేవారు. అప్పటి నుంచి జనం నోళ్లలో నానుతున్నారు. జీసస్ (jesus) వల్లే కరోనా వైరస్ (coronavirus) పోయిందన్నారు. ఆ తర్వాత క్షుద్రపూజలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాయత్తు (amulet talisman) గురించి మాట్లాడారు.
తనకు చిన్నప్పుడు ఆరోగ్యం (health worsen) బాగోలేదని చెప్పారు. అప్పుడు వైద్యులు (doctors) చేతులెత్తేశారని వివరించారు. తాత (grand father), అమ్మమ్మ దగ్గరలో ఉన్న మసీదుకు (mosquee) తీసుకెళ్లి తాయత్తు కట్టించారని పేర్కొన్నారు. అందువల్ల తాను ప్రాణాలతో ఉన్నానని వివరించారు. కొత్తగూడెంలో (kothagudem) ముస్లింలకు జీఎస్ఆర్ ట్రస్ట్ (gsr trust) ఆధ్వర్యంలో ఇప్తార్ విందు (iftar) ఇచ్చారు. ఆ సమయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జీఎస్ఆర్ ట్రస్ట్ (gsr trust) శ్రీనివాసరావుదే అనే సంగతి తెలిసిందే.
హెల్త్ డైరెక్టర్గా ఉండి ఇలా మాట్లాడటం ఏంటీ అని విమర్శలు వస్తున్నాయి. వైద్యుల (doctors) విశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటంపై అన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడే కాదు.. గతంలో కూడా చాలా సార్లు కామెంట్ చేశారు.
శ్రీనివాసరావు (srinivasa rao) యాక్టివ్గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ (brs party) నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ (cm kcr) కూడా టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని వార్తలు వినిపించాయి. క్లారిటీ మాత్రం రాలేదు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే అంశంపై స్పష్టత లేదు.