»Bjp Minister N Nagaraju Declares Assets Worth Rs 1609 Crore
Minister నాగరాజు ఆస్తులు రూ.1609 కోట్లు.. చదివింది మాత్రం తొమ్మిదే
కర్ణాటక మంత్రి నాగరాజు తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. రూ.1609 కోట్ల ఆస్తులను ప్రకటించగా.. అవీ వ్యవసాయం, వ్యాపారం, భవనాల అద్దె ద్వారా కూడబెట్టానని తెలిపారు.
BJP Minister N Nagaraju Declares Assets Worth Rs 1,609 Crore
Minister N Nagaraju:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 20వ చివరి తేదీ కావడంతో మంచి రోజు, గడియ చూసుకొని నామినేషన్ వేస్తున్నారు. కర్ణాటక మంత్రి ఎన్ నాగరాజు (nagaraju) (ఎంబీటీ) అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.1609 కోట్ల ఆస్తులు (assets) ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయన దేశంలోనే ధనిక రాజకీయ నేత (Richest politician) అయ్యారు. ఈయన చదివింది మాత్రం 9వ తరగతి (9th class) మాత్రమే.. తన ఆస్తులు వ్యవసాయం (agriculture), వ్యాపారం (business), భవనాల అద్దెల (buildings) ద్వారా కూడబెట్టానని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈసారి బెంగళూరు శివారు హోస్కెట్ (Hoskote) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాగరాజు (nagaraju) బరిలోకి దిగారు. తన భార్య ఎం శాంతకుమారితో (shantakumari) కలిసి రూ.536 కోట్ల చరాస్తులు.. రూ.1073 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయని పేర్కొన్నారు. నాగరాజు (nagaraju) ఇప్పుడు ఎమ్మెల్సీగా (mlc) ఉన్నారు. 2020 జూన్లో ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో అఫిడవిట్లో రూ.1220 కోట్లను తన ఆస్తులుగా చూపించారు. మూడేళ్లలో రూ.400 కోట్ల వరకు పెరిగాయని చూపించారు. తన అప్పులు మాత్రం రూ.98.36 కోట్లుగా ప్రకటించారు.
నాగరాజు (nagaraju) 2018లో హోస్కొట్ (Hoskote) నుంచి కాంగ్రెస్ పార్టీ (congress party) తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత పార్టీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి శరత్ బచెగౌడ (sharath) చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు శరత్ కాంగ్రెస్ పార్టీలో (congress) ఉన్నారు. బీజేపీ నుంచి నాగరాజు (nagaraju) పోటీలో ఉండగా.. వీరిద్దరీ మధ్య మరోసారి పోటీ ఉండనుంది.