విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం ప్రక్రియ ప్రారంభంమైంది. హెచ్ బి కాలనీలోని విలువైన స్థలంతో పాటుగా ఆటోనగర్, పెడగంట్యాడలో ఉన్న స్థలం అమ్మకానికి ఉక్కు కర్మాగార యాజమాన్యం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విక్రయానికి సంబంధించిన సమాచారం జూన్ 9న కేవలం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ రంగ సంస్థకు పంపబడింది. వచ్చే 10 రోజుల్లోగా స్పందించాలని పవర్‌గ్రిడ్‌ను కోరింది. VSP ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానించారు.
RINL లేఖ ప్రకారం 588 ప్లాట్లు 45 ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. దీంతోపాటు హెచ్బి కాలనీ, మద్దిలపాలెం ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణం అందుబాటులో ఉంది. అదేవిధంగా గాజువాక, ఆటోనగర్‌లో రెండెకరాల భూమిలో నాలుగు ల్యాండ్ పార్సిళ్లలో 76 ఇళ్లు ఉన్నాయి. మూడో ప్రదేశం పెద గంట్యాడ, ఇక్కడ ఒకే ల్యాండ్ పార్శిల్లో ఎనిమిది ఇళ్లను అమ్మకానికి పెట్టారు.
ఈ ప్రతిపాదిత విక్రయంపై సీనియర్ కార్మిక సంఘం నాయకులు వర్సాల శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయమని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, విలువైన భూములను కాపాడాలని ఉద్యమిస్తుంటే ఆర్ఐఎన్ఎల్ టెండర్లు కూడా పిలవకుండానే భూములను అమ్మకానికి పెట్టిందని అన్నారు. VSPకి చాలా నిధుల అవసరం ఉన్నందున, విక్రయాన్ని త్వరగా ముగించడానికి ప్రభుత్వ రంగ సంస్థను ఎంచుకున్నామని అధికారులు చెబుతున్నారు.