Duvvada Srinivas: ఏపీలో ఎన్నికల హీటెక్కింది. పొత్తులపై జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య మధ్య చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ కూడా దూసుకెళ్తోంది. సమయం దొరికితే చాలు.. పవన్ (pawan), చంద్రబాబు (chandrababu) లక్ష్యంగా సీఎం జగన్ (jagan) ఫైర్ అవుతున్నారు. ఎన్నికలకు సమయం ఉన్నా.. అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
టెక్కలి (tekkali) అభ్యర్థిని గత నెల 19వ తేదీన సీఎం జగన్ ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఇక్కడినుంచి బరిలోకి దిగుతారని బహిరంగ సభ వేదికపై చెప్పారు. ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంతవరకు ఓకే.. ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగడం లేదని వివరించారు. టెక్కలిలో తన భార్య వాణి (vani) పోటీ చేస్తారని తెలిపారు. ఇదే అంశం గురించి సీఎం జగన్తో (jagan) మాట్లాడానని.. ఆయన కూడా అంగీకరించారని తెలిపారు. మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇచ్చి.. మహిళను బరిలోకి దింపితే బాగుంటుందని శ్రీనివాస్ (Srinivas) అంటున్నారు.
వైసీపీ క్యాడర్ మాత్రం ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇలా జరిగిందని అంతా అనుకుంటున్నారు. మహిళా సాధికారితేనా.. ఇంకైమైనా కారణం ఉందా అని చర్చిస్తున్నారు. ఒక్కసారిగా భార్యను తెరమీదకు తీసుకురావడానికి కారణం ఏంటీ అని అంటున్నారు. ఇదే అంశం టెక్కలిలో చర్చకు దారితీసింది.