సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది హనుమాన్ సినిమా. రేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఉన్నా కూడా హనుమాన్ భారీ వసూళ్లను కొల్లగొట్టింది.
Hanuman: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాను.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండ్ చేసింది. సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకొని థర్డ్ వీక్‌లో ఎంటర్ అయిన కూడా హనుమాన్కు భారీ వసూళ్లు వస్తున్నాయి. 15వ రోజు కూడా ఒక్క తెలుగు స్టేట్స్లోనే ఐదున్నర కోట్లకి పైగా గ్రాస్‌ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తగా 15 రోజుల్లోనే 250 కోట్లకుగాపై గ్రాస్.. 130 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కాకుండా.. మిడ్ రేంజ్, యంగ్ హీరోలు నటించిన సినిమాలేవి ఇప్పటివరకు 250 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ మూవీగా హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్లు కూడా లేకపోవడంతో హనుమాన్ 300 కోట్ల మార్క్‌ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క హిందీలోనే 40 కోట్లకు పైగా రాబట్టింది హనుమాన్. ఈ వీకెండ్‌లోను సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.
దీంతో ‘హనుమాన్’ మరింత స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది అని చెప్పొచ్చు. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో భారీగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా హనుమాన్ ఓ సంచలనమే. అసలు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు ఐదారు రెట్ల లాభం తీసుకొచ్చేలా ఉంది. దీనికే ఇలా ఉంటే.. సీక్వెల్‌గా రానున్న జై హనుమాన్ డబుల్ టార్గెట్‌తో రాబోతోంది. ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ.. 2025లో జై హనుమాన్ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడు పాత్రల్లో స్టార్ హీరోలు కనిపించనున్నారు.