‘Guntur Karam’ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
ఎట్టకేలకు.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రంగం సిద్దమైంది. ఇంకొన్ని గంటల్లో దమ్ మసాలా బిర్యానీని టేస్ట్ చేయబోతున్నారు ఘట్టమనేని అభిమానులు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
Guntur Karam: వాస్తవానికైతే.. గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ కావాల్సి ఉంది. సాంగ్ షూటింగ్ డిలే అవడంతో.. త్వరలోనే అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ లోపు దమ్ మసాలా బిర్యానీ పాట లీక్ అయి నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో దీపావళికి వస్తుందనుకున్న సాంగ్.. కాస్త ముందే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దమ్ మసాలా.. ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్, తమన్ కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ ఆల్బమ్ కావడంతో.. గుంటూరు కారం మ్యూజిక్ పై అంచనాలు గట్టిగా ఉన్నాయి.
ఈ కాంబో హ్యాట్రిక్ ఆల్బబ్ హిట్ కొడుతుందని దమ్ మసాలా ప్రోమో చెప్పకనే చెప్పేసింది. స్లో పాయిజన్‌లా అదిరిపోయేలా ఉండబోతోంది ఈ సాంగ్. ఇక ఫుల్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా.. సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ అభిమానులు ఈ పాట కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీని దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తిపోవడం గ్యారెంటీ. ఇప్పటికే ట్విట్టర్లో ఓ రేంజ్లో సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇకపోతే.. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.