స్టార్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియో పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించగా.. తాజాగా రష్మిక కూడా రియాక్ట్ అయింది.
Rashmika: హీరోయిన్లపై మార్పింగ్ వీడియోలు కొత్తేం కాదు. చాలా కాలంగా వివిధ టెక్నాలజీతో ఫేస్.. బాడీ మార్పింగ్ జరుగుతునే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ ఇలాంటి మార్ఫింగ్ వీడియోల బారిన పడ్డారు. పైగా ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీతో వస్తున్న మార్పింగ్ వీడియోలు.. ఒరిజనల్‌గా కనిపిస్తున్నాయి. ఏది నిజమో, ఏది ఫేక్ వీడియోనో తెలియక నెటిజన్స్ అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేటెస్ట్గా రష్మిక రూపంతో ఉన్న ఓ మార్ఫింగ్ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ.. చివరకు ఇది ఫేక్ వీడియో అని తేల్చేశారు.
ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్కు సంబంధించినదని.. ఆ వీడియోని ఎవరో రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. తాజాగా రష్మిక కూడా ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయింది.
‘ఈ ఘటన గురించి మాట్లాడేలా చేయడం చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటి వల్ల నేనే కాదు, చాలా మంది భయానికి కారణం అవుతోంది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే భయంతో పాటు.. వాటి వలన నష్టాలు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు. ఈ రోజు ఒక మహిళగా, నటిగా నాకు రక్షణ మరియు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ ఇలాంటి ఘటన నేను స్కూల్లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే.. ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. మనమంతా ఒక కమ్యూనిటీగా మారి వీటికి పరిష్కారం చూపాలి’ అని రాసుకొస్తూ సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేసింది.