»Salaar Trailer Ready Prithviraj Sukumaran Got Kerala Rights
‘Salaar ‘ ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న విలన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అతని ఫ్యాన్స్. సలార్‌తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Salaar trailer ready.. Prithviraj Sukumaran got Kerala rights!
Salaar: కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో.. సలార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఆ రోజు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. మరోసారి సలార్ వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్నాయి. కొందరు నార్త్ వాళ్లు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోను ఈసారి అనుకున్న సమయానికి సలార్ రావడం పక్కా అని మేకర్స్ క్లారిటి ఇస్తునే ఉన్నారు.
రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో సలార్ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ హై ఓల్టేజ్ ట్రైలర్‌ను నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నాడట. అందుకే.. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ క్లారిటీ రానుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా పై హైప్‌ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. అందుకే ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మరోవైపు సలార్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే తెలుగు థియేట్రికల్ రైట్స్ 170 నుంచి 175 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. తాజాగా కేరళ సలార్ రైట్స్‌ను హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే.. సొంత భాష మళయాళంలో పృథ్వీరాజ్ప్రోడక్షన్ ప్రజెంట్ చేస్తోంది. We are delighted to partner with @PrithvirajProd to present #SalaarCeaseFire in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚! Get ready for an unforgettable cinematic experience.. అంటూ ప్రకటించారు మేకర్స్.