రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న హిట్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్ రెమ్యూనరేషన్ వైరల్‌గా మారింది.
Double Smart: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత సంజయ్ దత్ మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే.. డబుల్ ఇస్మార్ట్ కోసం భారీగా అందుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇస్మార్ట్‌తో ఢీ కొట్టాలంటే.. విలన్ రేంజ్ ఆ మాత్రం ఉండాల్సిందేనని అంటున్నారు.
సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే సినిమా సెట్స్‌లో సిక్స్ ప్యాక్ సెల్ఫీ పిక్‌ను షేర్ చేశాడు రామ్. దీంతో డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఓపెనింగ్ రోజే 2024 మార్చి 8న ఈ సినిమాను రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. అందుకు తగ్గట్టే జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.