Samantha: గుడ్ న్యూస్.. సమంత మళ్లీ మొదలుపెట్టింది!
గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది స్టార్ బ్యూటీ సమంత. మయో సైటిస్ కారణంగా బ్రేక్ ఇచ్చింది. దీంతో మళ్లీ సమంత సినిమా వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? అంటూ ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Samantha: సమంత నటించిన లాస్ట్ ఫిల్మ్ ఖుషి. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సమంత నుంచి ఒక్క సినిమా కూడా రావడం లేదు. బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ తప్పితే సమంత అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా లేవు. అంతేకాదు.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి కూడా సమంత తప్పుకుంటోంది. రీసెంట్గా ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న ఈ ఇంగ్లీష్ ఫిలిం నుంచి సమంత తప్పుకుందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత.
దీంతో ఇకపై సమంత హీరోయిన్గా చేయదా? అనే సందేహాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం సమంత పూర్తిగా రికవరీ అయినట్లేనని అంటున్నారు. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్స్ పనులతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా సిటాడెల్ డబ్బింగ్ స్టూడియోలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సామ్. హిందీ సిరీస్ రషెస్ చూశానని, చాలా బాగా వచ్చాయంటూ ఓ పోస్ట్పెట్టింది. అలాగే వరుణ్‌ధావన్ మరియు డైరెక్టర్స్ రాజ్డీకేలతో కలిసి దిగిన ఫోట్ను షేర్ చేసింది. సామ్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత రీఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సమంత ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి సామ్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి.