Shambhala emotional video song release from 'Kalki'
Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లను రాబడుతోంది. అన్ని భాషాల్లో దుమ్ముదులుపుతుంది. సమ్మర్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో కల్కికి బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వీడియో సాంగ్‌ను టీమ్ విడుదల చేసింది. ఇటీవలే కాంప్లెక్స్ సిటీలో ప్రభాస్, దిశా పటానీ డ్యాన్స్ చేసే పాటను విడదుల చేశారు. దానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు శంభాల పాట సైతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
కల్కి చిత్రం జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టింది. అతిత్వరలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను చేరువకానుంది. ఈ సందర్భంగా హోప్ ఆఫ్ శంభాల (Hope of Shambala) పాటను విడుదల చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి వంటి దిగ్గజ నటులు ఉన్నారు.