Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ రెడీ? RC 16 కీలక అప్డేట్!
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. కానీ గేమ్ చేంజర్ అప్డేట్స్ లేక అప్సెట్ అవుతునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఫైనల్‌గా గేమ్ ఛేంజర్ టీజర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Game Changer: అసలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ అన్నప్పుడే.. ఆర్సీ 15 ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేశాడు శంకర్. కానీ ఎప్పుడైతే మధ్యలోకి ఇండియన్ 2 దూసుకొచ్చిందో.. అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్తునే ఉంది. కనీసం ఇప్పటి వరకు ఒక్క చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు శంకర్. అసలు షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయిందనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. గతంలో జరగండి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని మాట తప్పిన మేకర్స్.. ఈసారి మాత్రం మెగా ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.
మార్చ్ 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆరోజు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే రోజున సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరోవైపు.. ఆర్సీ 16 నుంచి చరణ్ బర్త్ డేకు ఫస్ట్ లుక్ రివీల్‌కు ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. ఇప్పటికే క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు. హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. లేటెస్ట్గా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి డీఓపిగా ఫైనల్ అయినట్టు.. ఆర్సీ 16 టీమ్‌లోకి ఆహ్వానం పలికారు. ఏదేమైనా.. ఈసారి చరణ్ బర్త్ డేకి సాలిడ్ ట్రీట్ ఉంటుందనే చెప్పాలి.