CTR: నగరి మున్సిపాలిటీ 11 వ వార్డు ఇందిరానగర్ వాసులు ఇటీవల ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించినపుడు త్రాగునీటి ఇబ్బంది, వీధి లైట్లు, మురికి కాల్వ అపరిశుభ్రత గురించి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ మేరకు స్థానిక తెలుగుదేశం నాయకులు మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలుతో అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించారు.