VSP: విశాఖపట్నంలోని మల్కాపురంలో ఉన్న సెయింట్ అన్నాస్ నర్సింగ్ కళాశాలలో సోమవారం ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ. రత్నం మాట్లాడుతూ, “స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ్ర” కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి వస్త్ర సంచులు ఉపయోగించాలని కోరారు.