ప్రకాశం: కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూనియన్ నాయకులు, భవన్ నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. CITU నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి నేతలు లారి ఇసుకను యజమానులు దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఏవో కు వినతి పత్రాన్ని అందజేశారు.