KDP: జిల్లాలో కొన్నిచోట్ల యూరియా కోసం అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాలకు కలిపి 2,600 టన్నుల యూరియా కేటాయించారు. గూడ్స్ రైలులో సంబంధిత యూరియా కడపకు చేరుతుందని వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ వెల్లడించారు. ఇందులో కడప జిల్లాకు 2,080 టన్నులు రాగా ప్రైవేట్ డీలర్లకు 780 టన్నులు, మార్క్షెడ్కు 13 టన్నులు కేటాయించారు.