KRNL: ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్, ప్రధాన కూడలిలో ఇవాళ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్, మండల నాయకులు దయాసాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం GST తగ్గించడంతో దేశ ప్రజలు హర్షిస్తున్నారని, అందుకే ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు.