NLG: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చిట్యాల పట్టణంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.