NLR: వింజమూరు మండలం ఊటుకూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిని ఢీ కొని గురువారం మినీ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వాహనంలో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.