ప్రకాశం: జిల్లా నూతన కలెక్టర్ రాజబాబు ఇవాళ దోర్నాల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు దోర్నాల చేరుకుంటారు. 10:45 నుంచి 1 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ 2 టన్నెల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు.