ATP: ఉరవకొండలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ‘చలో పెనుకొండ మెడికల్ కాలేజ్’ కార్యక్రమ పోస్టర్లను యువజన విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. పెనుకొండ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు నిరసన చేపట్టనున్నామని వారు తెలిపారు. పీపీపీ విధానంతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.