ATP: గుత్తి వైసీపీ కార్యాలయంలో గురువారం వైసీపీ పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే పెనుగొండలోని చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.