KRNL: నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే మహిళలు తమ శిశువులకు పాలు పట్టించుకునే సౌకర్యం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం నగరసంస్థ దృష్టికి రావడంతో, ప్రత్యేకంగా స్తన్యపాన గది ఏర్పాటుకు కమిషనర్ పి.విశ్వనాథ్ చర్యలు చేపట్టారు. గురువారం ఆయన స్వయంగా గదిని పరిశీలించి, అవసరమైన పనులను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.