MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వన దుర్గ భవానీ దేవస్థానంలో జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు ఆహ్వానం అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రావికోటి శంకర్ శర్మ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.