రీజనల్ లెవల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా రీజనల్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయడం మహేష్‌కే చెల్లింది. అలాగే కమర్షియల్‌గా కూడా మహేష్‌దే టాప్ ప్లేస్.
Mahesh babu: సినిమాలే కాదు.. కమర్షియల్‌గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. టాలీవుడ్ హీరోల్లో కమర్షియల్‌గా మహేష్ బాబునే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఒక్కో యాడ్‌కు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు మహేష్. లేటెస్ట్గా ఓ 5 సెకండ్ల యాడ్‌కు 5 కోట్లు తీసుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన విషయం తెలిసిందే. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం లాంటి యూపిఐ యాప్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫోన్‌పే యూపిఐ మహేష్ బాబుతో టైఅప్ అయ్యింది. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే, మనీ రిసీవ్డ్.. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష బాబుకు ఫోన్ పే సంస్థ ఏకంగా 5 కోట్ల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఏంది మహేషా? ఈ క్రేజ్ అంటు చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక రాజమౌళి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో.. హాలీవుడ్ రేంజ్లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసిన రాజమౌళి.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు ఫిజికల్‌గా రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ పైకి వెళ్లనుంది. ఏదేమైనా.. మహేష్ పాన్ ఇండియా ఎంట్రీ తర్వాత మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.