RamCharan: ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్
గేమ్‌ఛేంజర్ మూవీలోని పాటకు సంబంధించిన ఫుటేజ్‌ను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లీకులకు సంబంధించి చిత్ర యూనిట్ ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబోలో ‘గేమ్‌ఛేంజర్’ మూవీ (GameChanger) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పాటను సోషల్ మీడియాలో లీక్ (Leak) చేశారు. పాటను లీక్ చేసిన వారిపై తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ (Cyber crime Department) చర్యలు తీసుకుంది. చిత్ర యూనిట్ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పాటను లీక్ చేసిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఇకపోతే ఈ ‘గేమ్‌ఛేంజర్’ మూవీకి లీకుల బెడద బాగానే ఉంది. మూవీకి సంబంధించిన షూటింగ్ ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ (Photos,Video Clippings) సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లీకులను ఎదుర్కొనేందుకు ప్రొడక్షన్ టీమ్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. మూవీకి సంబంధించిన కంటెంట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగానే లీక్ చేస్తున్నారని ఫిర్యాదు నమోదైంది. ఈ మూవీకి పైరసీ సమస్యలు కూడా ఉన్నాయని యూనిట్ ఫిర్యాదులో పేర్కొంది.
‘గేమ్‌ఛేంజర్’ మూవీలో ఈమధ్యనే యాక్షన్ సీన్లు లీక్ (Action scenes Leak) అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని ‘జరగండి’ పాటకు సంబంధించిన ఫుటేజ్ నెట్టింట ప్రత్యక్షం అయ్యింది. దీనికి బాధ్యులైన ఇద్దర్ని సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత అలాంటి ప్రయత్నాలు మళ్లీ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సైబర్ పోలీసులు వారిని హెచ్చరించారు. పైరసీకి అడ్డుకట్ట వేసిన సైబర్ క్రైమ్ డివిజన్ ఏపీనీ చాంద్ బాషా, ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ప్రసేన్ రెడ్డి, సాయి తేజశ్రీ, ఇతర సైబర్ డిపార్ట్మెంట్ సభ్యులకు మూవీ యూనిట్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.