నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఏఐ (AI) సాయంతో రష్మిక ఫేస్న్ని ఓ మహిళకు మార్ఫింగ్ చేశారు. రష్మిక కురచదుస్తులు ధరించినట్టు కనిపిస్తున్న ఈ వీడియో నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. వీడియోపై అభిమానుల్లో కలకలం రేగుతుండటంతో ఓ జర్నలిస్టు ఈ వీడియో వెనక వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. మరో సోషల్ మీడియా (Social media) ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారని వెల్లడించారు. సెలబ్రిటీలను అపఖ్యాతి పాలు చేస్తున్న నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగులో, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో రణబీర్(Ranbir) సరసన యానిమల్(Animal) సినిమాతో రాబోతుంది. వచ్చే సంవత్సరం పుష్ప 2(Pushpa 2)తో రాబోతుంది. ఇవే కాక రష్మిక చేతిలో ఇంకో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. ఇక రష్మికకు ఆన్లైన్ లో, బయట చాలా మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు.రష్మిక ఏంటి ఇలా తయారయి బయటకి వచ్చింది అని ఆశ్చర్యపోతూనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది ఫేక్ వీడియో (Fake video) అని కొంతమంది కనిపెట్టేసారు.