KRNL: వెల్దుర్తిలోని అయ్యప్ప స్వామి ఆలయం, కేదారేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి నంద్యాలకు చెందిన వ్యాపారవేత్త మల్లేశ్వర రెడ్డి రూ. 35 వేల విరాళం నిన్న అందించారు. అయ్యప్ప స్వామి ఆలయం కోసం వెండి తోరణం, కేదారేశ్వర స్వామి ఆలయ ముఖ మండపం నిర్మాణం కోసం వినియోగించాలని ఆలయ కమిటీని ఆయన కోరారు. దాతకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి, ఆశీర్వచనాలు చేశారు.