VSP: ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు.