BPT: అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం బుధవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పెంట్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన కేశవ గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు.