Game changer: గేమ్ ఛేంజర్.. అయితే 4 నెలలు, లేదంటే 6 నెలలు?
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. లేటెస్ట్గా ఈ సినిమా కోసం రెండు డేట్లు విపిపిస్తున్నాయి.
Game changer: గేమ్ ఛేంజర్ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా చరణ్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగు బ్యూటీ అంజలీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది, కానీ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో ఇండియన్ 2 లైన్లోకి రావడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్గా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించిన చిత్ర యూనిట్.. లేటెస్ట్ షెడ్యూల్‌ని వైజాగ్‌లో షూట్ చేస్తున్నారు. అక్కడ చరణ్ ఇంట్రోకి సంబంధించినట్టుగా షూట్ చేస్తున్నారట. వాస్తవానికైతే.. ఎప్పుడో చరణ్ ఎంట్రీ షూటింగ్ కంప్లీట్ అయిందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు చరణ్ పై అదిరిపోయే ఇంట్రో సీన్స్‌ని ఇప్పుడు తెరకెక్కిస్తున్నాడట శంకర్. ఈ షెడ్యూల్‌తో రామ్ చరణ్ పోర్షన్ దాదాపుగా పూర్తవుతుందని సమాచారం. దీంతో.. గేమ్ చేంజర్‌లో చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తవగానే.. ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. తిరిగొచ్చిన తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడంటే? మేకర్స్ నుంచి సరైన సమాధానం రావడం లేదు. కానీ ఈ రెండు డేట్లలో ఏదో ఒకటి ఫిక్స్ చేయడం పక్కా అంటున్నారు. అక్టోబర్ ఎండింగ్లో అంటే, అక్టోబర్ 31 రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేదంటే.. ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ రెండు తేదీల్లోనే గేమ్ ఛేంజర్ రావడం పక్కా అని అంటున్నారు. కాబట్టి.. గేమ్ చేంజర్ అక్టోబర్‌లో వస్తే నాలుగు నెలల్లోనే వస్తుంది.. లేదంటే డిసెంబర్ అయితే ఆరు నెలల్లో రావడం గ్యారెంటీ.