»Mahesh Babu Rajamouli More Delayed The Sets Will Be Up Soon
SSMB29: ‘మహేష్ బాబు-రాజమౌళి’ మరింత ఆలస్యం.. సెట్స్ పైకి అప్పుడే?
ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇంతకుముందెన్నడూ ఈ రేంజ్లో ఈగర్‌గా వెయిట్ చేసి ఉండరు. కానీ, రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమా రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది.
'Mahesh Babu-Rajamouli' more delayed.. The sets will be up soon?
SSMB29: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించి.. హాలీవుడ్‌ని తన వైపు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుబతో డైరెక్ట్‌గా హాలీవుడ్ సినిమానే చెయబోతున్నాడు. ఇప్పటికే హాలీవుడ్‌కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ గట్టిగా జరుగుతోంది. మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడు మహేష్. ఇక రాజమౌళి సైలెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటు పోతున్నాడు. స్క్రిప్టు లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే మహేష్ బాబుతో వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. దాని కోసం రెండు నెలలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు.
దీంతో.. ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే.. ఈ సినిమాను ఆగష్టులో మహేష్ బర్త్ డే సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎస్ఎస్ఎంబీ 29 మరింత వెనక్కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం షూట్‌ని మొదలు పెట్టనున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అప్పటికీ కుదరకపోతే.. కొత్త సంవత్సరంలో కొత్త ముహూర్తం పెట్టుకోవాల్సిందేనని అంటున్నారు. కానీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రం వంద కోట్లతో భారీ సెట్ వేస్తున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. కాబట్టి.. ఒక్కసారి అన్నీ సెట్ అయితే జక్కన్న షూటింగ్‌కు వెళ్లడమే లేట్ అన్నమాట.