NLR: కావలి మండలం అల్లిగుంట పాలెం క్రాస్ రోడ్డు సమీపంలోని NH 16 పక్కన సుమారు 70-75 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడు మరణించాడు. దీంతో సర్వాయిపాలెం వీఆర్వో శ్రావణి గమనించి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేరకు ఎస్సై తిరుమల రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకలి, దప్పిక లేదా అనారోగ్యంతో మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు.