అర్ధవీడు మండలం గన్నేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బీడు పొలాల్లో పోట్లాడుతున్న రెండు ఎద్దులను విడదీయడానికి ప్రయత్నించిన యాజమాని షేక్ పెద్ద మహబూ (60)పై అవి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.