ADB: సాత్నాల మండలంలో ఆదివారం రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మండలంలోని పార్టీకే గ్రామపంచాయతీ సర్పంచిగా కిషోర్ విజయం సాధించారు. 5 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ బలపరిచిన ప్రత్యర్థి సుభాష్ పై గెలుపొందారు. దీంతో ఆయన్ను పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటామని కిషోర్ హమిచ్చారు.