BPT: జిల్లా ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.