KRNL: కోడుమూరులోని గ్రంథాలయ సంస్థ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని వక్తలు హెచ్చరించారు. ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉద్యమం తప్పదని తెలిపారు. గ్రామ పంచాయతీ, సంబంధిత అధికారులు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.