మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ‘గాలోడు’ సినిమాతో.. హీరోగా సుడిగాలి సుధీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పోయిన శుక్రవారం విడుదలైన ‘గాలోడు’ మూవీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం.
దాంతో ఫుల్ జోష్‌లో ఉంది గాలోడు చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే లాభాల బాట పట్టిన గాలోడు మూవీకి.. భారీ ఓటిటి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటిటి సంస్థలతో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఓ ప్రముఖ ఓటిటి సంస్థ దాదాపు నాలుగు కోట్లకు ‘గాలోడు’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.
త్వరలోనే గాలోడు ఓటిటి పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. సుధీర్ రేంజ్ మారిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ‘జబర్దస్త్’ కమెడియన్‌గా కెరీర్ మొదలు పెట్టిన సుధీర్.. ఇప్పుడు హీరోగా భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గాలోడు సినిమాకు సుధీర్ దాదాపు యాభై లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. సుధీర్ రేంజ్ మారిపోయినట్టేనని అంటున్నారు. గాలోడు క్రేజ్ చూసి సుధీర్‌కు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట మేకర్స్. దాంతో సుధీర్ నుంచి నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్ రాబోతోందని చెప్పొచ్చు. అయితే ఇక పై సుధీర్ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకోవాలని అంటున్నారు అభిమానులు. మొత్తంగా గాలోడు దెబ్బకు సుధీర్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.