ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 1, 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 3’ కూడా ఉండనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను 2028లో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రవి శంకర్ తెలిపారు. ‘రాబిన్‌హుడ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం బన్నీ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు.