»Everything Will Be Better From Now On Samantha Is Full Of Happiness
Samantha: ఇకపై అంతా మంచే.. సమంత ఫుల్ హ్యాపీ!
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఎందుకో విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు కారణమేంటో వాళ్లకే తెలియాలి. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు ఈ ఇద్దరు.
ప్రస్తుతం సమంత పలు భారీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. కానీ ఆ మధ్య మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే సమంత పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొంటోంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. ఏప్రిల్ 28న సమంత 36వ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకుంది. దీంతో సోషల్ మీడియాలో సమంతకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సమంత కూడా తనకు అత్యంత సన్నిహితుల బర్త్ డే విషెస్‌ని.. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా సామ్ చేసిన పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ సెల్ఫీని షేర్ చేస్తూ.. ‘ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్’ అని కామెంట్ పెట్టింది. మొన్నటి వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తున్నానని చెబుతున్న సమంత.. ఈ ఏడాది నుంచి అంతా మంచే జరుగుతుందని కామెంట్ చేయడం విశేషం. దీంతో సమంత మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకున్నట్టేనని చెప్పొచ్చు. ఇక సమంతకు బర్త్ డే విష్ చేస్తూ.. ఖుషి మూవీ నుంచి ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో సమంత చాలా క్యాజువల్‌గా, క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది. మెడలో ఐడి కార్డ్ వేసుకుని ఆఫీస్‌కి వెళ్తున్నట్టుగా.. చాలా సింపుల్, అండ్ కూల్‌గా కనిపిస్తోంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టే.. సమంత ‘ఖుషి’ లుక్కు ఫిదా అవుతున్నారు అభిమానులు. ఏదేమైనా.. ఇక పై సమంత ఫుల్ ఖుషిగా ఉంటుందనే చెప్పాలి.