సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా ఉంది. అయినా తగ్గేదేలే అంటున్నారు రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉంది. రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. కానీ ఈ సినిమా సమ్మర్‌కు షిప్ట్ అవనుందనే టాక్ ఉంది. కాబట్టి ఇంకొన్ని సినిమాలు రేసులోకి దూసుకొస్తున్నాయి. తాజాగా దిల్ రాజు తన సినిమాను సంక్రాంతికి తీసుకువస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ, పరశురామ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది.. త్వరలోనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని చేస్తాం.. 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. ఇక దిల్ రాజు అలా రేసులోకి వచ్చాడో లేదో.. వెంటనే మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని గతంలోనే ప్రకటించినప్పటికీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చని ఊహాగానాలు వచ్చాయి, కానీ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈగల్ సినిమా 2024 జనవరి 13న థియేటర్లోకి రానుందని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రకటించారు. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక రౌడీ, రవితేజ సంక్రాంతికి సై అనడంతో.. సంక్రాంతి వార్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ.. మహేష్ బాబు సినిమా నుంచి రౌడీ, రవితేజ, నాగార్జున గట్టి పోటీ తప్పదనే చెప్పాలి.