»Nayanthara Vignesh Shivan Twins B Day Celebrated In Style
Nayanthara: పిల్లల పుట్టినరోజు.. నయనతార ఎమోషనల్ పోస్ట్..!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దర్శకుడు విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.
నయనతార, విఘ్నేష్ కుమారులు ఉయిర్, ఉలాగ్ లు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఎమోషనల్ అయ్యింది. రూపంలో, గుణంలో చక్కనైన వారంటూ కొడుకులను ఆకాశానికి ఎత్తింది. తమ పిల్లల్ని మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నామని, జీవితంలో అన్నింటికి మించిన ఆనందం వారేనంటూ వర్ణించింది. ఇద్దరికీ ఓకే మాదిరి డ్రెస్ వేసి క్యూట్ గా రెడీ చేశారు. ఫ్యామిలీ ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఇక తమ జీవితంలోకి వచ్చినందుకు, చాలా సంతోషపరిచినందుకు ధన్యవాదాలు అంటూ ఉయిర్, ఉలగ్ ను మరోసారి విష్ చేసింది. జీవితంలో అన్ని సానుకూలతలు ఉండాలని, అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంది. గడిచిన ఏడాది సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. చివరిగా ‘జవాన్’తో అలరించింది నయనతార. ఈ చిత్రంతో రూ.1000 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పిల్లలకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.