సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ 3. టైగర్ సీక్వెన్స్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెన్స్ గా ఈ మూవీ వస్తోంది.
తాజాగా టైగర్ 3 మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్ నుంచి వస్తున్న సినిమా ఇది. పఠాన్ తర్వాత ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా విడుదల చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను టైగర్ కా మెసేజ్ పేరిట మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్లో టైగర్ అనే RAW ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ వాయిస్ మెసేజ్ రికార్డింగ్ చేస్తున్నట్లు చూపించారు. తన ప్రియమైన దేశానికి 20 సంవత్సరాల నిజాయితీగా సేవ చేసిన తర్వాత, తనను దేశద్రోహిగా పరిగణిస్తున్నారని అతను విచారం వ్యక్తం చేశాడు.
టీజర్ ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. టైగర్ జిందా హై, వార్ , పఠాన్ సంఘటనల తర్వాత కథ జరుగుతుందని టీజర్ వెల్లడించింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ జోయా పాత్రలో నటించింది. మనీష్ శర్మ ఈ హై ఆక్టేన్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆదిత్య చోప్రా కథా రచయితగా కూడా పనిచేశాడు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. 2023 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.